Breaking News

అక్క,చెల్లెమ్మల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం పరిపాలన-అరకు ఎంపీ.

0 21

 అక్క చెల్లెమ్మల అభ్యున్నతే ధ్యేయంగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని అరకు ఎంపీ  గోడ్డేటి మాధవి అన్నారు.

జగనన్న నామస్మరణంతో దద్దరిల్లిన సభా ప్రాంగణం.



ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా,మోదమాంబ ఆడిటోరియం వద్ద జరిగిన ‘వైయ‌స్సార్‌ చేయూత’ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.


కార్యక్రమం ప్రారంభానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేసి,ముగింపు అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.



ఈ సందర్భంగా ఎంపీ  మాట్లాడుతూ..వైయ‌స్‌ జగన్‌ తన పాదయాత్ర సమయంలో అక్క చెల్లెమ్మల కష్టాలు స్వయంగా చూశారని,అందుకే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.


 వైయ‌స్సార్‌ చేయూత,ఆసరా, పావలా వడ్డీ,ఇలా అనేక పథకాలు  అక్క చెల్లెమ్మల అభ్యున్నతికి దోహదపడుతాయని తెలిపారు.


2877 మంది అక్క చెల్లెమ్మల వైయస్సార్ చేయూత మూడో విడత నగదు జమ చేశారు.

5 కోట్ల 39 లక్షల 43 వేల 750 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు.



ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి,ట్రైకార్ చైర్మన్ శతక బుల్లి బాబు,ఎంపీపీ,సర్పంచులు,ఎంపిటిసిలు,అధికారులు,లబ్ధిదారులు,అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.