Breaking News

కొయ్యూరులో జనసేన పార్టీ సమావేశం.

0 49

 కొయ్యూరులో జనసేన పార్టీ సమావేశం.


అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం గ్రామంలో జనసేన పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అరకు పార్లమెంట్ సభ్యుడు వంపూరు గంగులయ్య హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలను మోసగించారని,రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసిన అభివృద్ధి శూన్యమని,రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ కాలయాపన చేస్తున్నారని,నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జనవరిలో డీఎస్సీ తీస్తానని చెప్పి మూడు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ ఒక్క డీఎస్సీ కూడా తీయలేదని విమర్శించారు.13 జిల్లాలను 23 జిల్లాలుగా విడదీసి వాటికి మౌలిక సదుపాయాలు కల్పించలేదని దుయ్యబట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుకే ఐటిడిఏ గాని ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఏమి చేశారు?స్థానిక ఎంపీ,ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు. 

ఏజెన్సీలో ఎక్కడ చూసినా రోడ్లు పరిస్థితి బాగోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 27 పథకాలు రద్దు చేసిందని, ఏజెన్సీలోని గిరి రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు, రాజ్మా విత్తనాలు సకాలంలో ఇవ్వకపోవడం వల్ల విత్తనాలు వేయలేని పరిస్థితి, రాష్ట్రంలో కౌలు రైతులు 300 మంది మరణిస్తే మా నాయకుడు పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగిందని,ఈ ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేస్తానని మోసగించారని,గిరిజనులకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వటం లేదని,గత వారం రోజులుగా చూస్తే కొయ్యూరు మండలంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అభివృద్ధిపై ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప మండల హెడ్ క్వార్టర్లో రోడ్లు పరిస్థితి వర్షం పడితే చెరువులను తలపిస్తున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారని,అధికార పార్టీ నాయకులు దానిపై స్పందిస్తే బాగుంటుందని,లేనిపక్షంలో జనసేన పార్టీ గుంతలు కప్పటానికి నిర్ణయం తీసుకుంటుందని గంగులయ్య చెప్పడం జరిగింది.రాష్ట్ర ప్రజలు మార్పు కోసం చూస్తున్నారని, జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడిన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమానికి జనసేన మండల పార్టీ నాయకులు సాగిన బుజ్జిబాబు,సిద్దు, వాకాడ వినయ్, అశోక్,సత్యనారాయణ,గూడెపు లక్ష్మణరావు,సెగ్గే నాని,దుచ్చరి రమేష్,గొకిరి శివ,జుర్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.