Breaking News

పోలీసుల ఆధ్వర్యంలో లోన్ యాప్స్ పై ప్రజలకు అవగాహన.

0 20

 

కొయ్యూరు సీఐ స్వామి నాయుడు, కొయ్యూరు ఎస్సై రాజారావు,మంప ఎస్సై లోకేష్ కుమార్ ఆధ్వర్యంలో నడింపాలెం గ్రామంలో గ్రామస్తులతో మీటింగ్ నిర్వహించి గ్రామస్తులకు లోన్ యాప్స్ వాడటం వల్ల కలిగే అనర్ధాలను తెలియపరచి వాటికి దూరంగా ఉండాలని తెలియపరచడం జరిగింది.

అలాగే సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియపరచడం జరిగింది.లోన్ యాప్స్, ఫ్రాడ్స్,సైబర్ నేరాలు, ఏ విధంగా చేస్తారు అని తెలియపరిచి వాటిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తెలియపరచడం జరిగింది. అలాగే గ్రామస్తులు అందరూ కూడా నాటు సారా, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించడం జరిగింది. సారా తాగడం వల్ల కలిగే అనర్ధాలను తెలియపరచి, అలాగే గంజాయినీ పండించడం, రవాణా చేయడం వంటివి చట్ట వ్యతిరేకమైన చర్యలని తెలియపరిచి వీటివల్ల జైలు పాలు అయ్యి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలియపరచడమైనది.

Leave A Reply

Your email address will not be published.