Breaking News

మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన గోడపత్రికలు.

0 47

 అల్లూరి ఆదివాసి యువజన సంఘం పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలసిన గోడపత్రికలు.


మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా,జికె.వీధి మండల కేంద్రంలో పలు చోట్ల మావోయిస్టులకు వ్యతిరేకంగా గోడపత్రికలు వెలిశాయి. ఇందులో మావోయిస్టులారా మా అల్లూరి జిల్లాకు రావద్దు,మా అభివృద్ధి ని అడ్డుకోవద్దు అని, 

అల్లూరి జిల్లాలో మావోయిస్టులు తిరిగినప్పుడు ఉన్న దుస్థితి: వీరవరంలో మావోయిస్టులు కూల్చిన ఇల్లులు,రోడ్డు పనులు జరగకుండా బూసుపుట్టు వద్ద మావోయిస్టులు కాల్చిన ప్రొక్లెనర్, ఫోన్ సిగ్నల్ రాకుండా దారకొండ వద్ద మావోయిస్టులు కాల్చిన సెల్ టవర్.

అల్లూరి జిల్లాలో మావోయిస్టులు లేనప్పుడు ఉన్న పరిస్థితి: సంతోషంగా ప్రశాంతంగా నృత్యం చేస్తున్న గిరిజన ప్రజలు, జక్కం నుండి కోండ్రుం గ్రామానికి జరుగుతున్న రోడ్డు పనులు, సెల్ టవర్ రావడం వలన కుటుంబ సభ్యుల యోగక్షేమాలు, అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న గిరిజన ప్రజలు గురించి వివరించారు. 


  మావోయిస్టులారా మీరు మా గ్రామాలకు రావద్దు.. మా అభివృద్ధిని అడ్డుకోవద్దు అని ఈ పోస్టర్లో పేర్కొన్నారు.  

Leave A Reply

Your email address will not be published.