Breaking News

అరకు,చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత తీర్చాలని విద్యాశాఖ మంత్రి ని కోరిన ఎంపీ, ఎమ్మెల్యే.

0 24

 అరకు వ్యాలీ,చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ కొరత తీర్చాలని 

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని కోరి వినతి పత్రాన్ని అందజేసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి,పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి.


ఈరోజు విశాఖపట్నంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి,ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కలిసి పలు అంశాలను ప్రస్తావించారు.

అరకు వ్యాలీ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తదితర విషయాలపై క్లుప్తంగా వివరించి,త్వరితగతంగా టీచింగ్,నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం చేపట్టాలని కోరారు.

చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు,టీచింగ్ స్టాప్, నాన్ టీచింగ్ స్టాప్ కొరత తీర్చాలని కోరారు.

అదేవిధంగా ఈ కళాశాలకు ప్రహరీ గోడ లేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారుతోందని కావున కళాశాల విద్యార్థిని,విద్యార్థుల రక్షణ దృష్ట్యా ప్రాంగణానికి చుట్టూరా ప్రహరీ గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి ని కోరారు.

ఈ అంశాలపై మంత్రి,సానుకూలంగా స్పందించారని ఇరువురు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.