Breaking News

కొయ్యూరు:బాలురు-1 పాఠశాల వద్ద వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ ఎన్నికలు.

0 25

 కొయ్యూరు: బాలురు-1 పాఠశాల వద్ద వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ ఎన్నికలు.


 అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ ఎన్నికలు ఆదివారం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలురు-1 పాఠశాల కొయ్యూరు నందు జరిగినది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా పాంగి సింహాచలం వ్యాయామ సంచాలకులు ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల తలారి సింగి నుండి, అలాగే ప్రధాన కార్యదర్శిగా కంగల పోతురాజు ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల రంపచోవడం, కోశాధికారిగా కుర్ర నాగేశ్వరరావు ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల హుకుంపేట, మహిళా కార్యదర్శి కిల్లి సుధారాణి వ్యాయామ సంచాలకులు పెద్దగరువు, అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా మత్స్యరాస మచ్చరాస భూపతి రాజు ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. రాబోవు రోజుల్లో సంఘ కార్యక్రమాలు నిర్వహణ వీరి ఆధ్వర్యంలో జరుగును. రాష్ట్రస్థాయి ఎన్నికల అధికారిగా ఎం.వాసుదేవరావు నాయుడు,అలాగే ఎన్నికల పరిశీలకులుగా ఎన్.వెంకట్ నాయుడు అలాగే జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ స్వామి శివాచలం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.


సుమారుగా 22 మండలాల నుండి 196 మంది ప్రతినిధులు హాజరైనారు. ఈ కార్యక్రమాన్ని అంబటి నూకరాజు వ్యాయామ సంచాలకులు అకాడమీ కోచ్ వ్యవహారంగా వ్యవహార కర్తగా నిర్వహణ కర్తగా వాయిదాలు వ్యవహరించారు.

Leave A Reply

Your email address will not be published.