కొయ్యూరు: ఈనెల 28,29,30 తేదీల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.
ఈనెల 28,29,30 తేదీల్లో మండలంలోని కొయ్యూరు, రాజేంద్రపాలెం లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వైసిపి పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 28వ తేదీన ఉదయం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం, మధ్యాహ్నం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అలాగే మరుసటి 29,30 తేదీల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, ఎంపీ గొడ్డేటి మాధవి హాజరవుతారని పేర్కొన్నారు. ఈ యొక్క గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వైసిపి పార్టీ ఎంపీటీసీలు,సర్పంచులు,మండల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తప్పనిసరిగా హాజరుకావాలని వైసిపి పార్టీ మండల అధ్యక్షుడు జల్లిబాబులు, ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు తెలిపారు.