Breaking News

జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం.

0 22

 జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం.


ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర ఆధ్వర్యంలో జడ్పీ సీఈఓ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగింది.


ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర ఆహ్వానం మేరకు విశిష్ట అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.

ప్రజా ప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించి,జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులను,జడ్పిటిసి లకు ప్రజా ప్రతినిధులు కలిసి దుస్సాలువతో సత్కరించిన అనంతరం ఎంపీ కి దుస్సాలువా సన్మానించడం జరిగింది.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు,అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి సత్యవతి,పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,ట్రైకార్ చైర్మన్ శతక బుల్లి బాబు,జిసిసి ఛైర్పర్సన్ శోభా స్వాతిరాణి,జిల్లా ప్రజా ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.