కొయ్యూరు:సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కలిగించిన ఎస్ఐ రాజారావు.
ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొయ్యూరు ఎస్ఐ రాజారావు సూచించారు. ఆదివారం ఆయన రాజేంద్రపాలెం వారపు సంతలో ప్రజలకు ఆన్లైన్లో జరిగే మోసాల గురించి అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింకుల పట్ల మొబైల్ ఫోన్లు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే 1930 నెంబర్ కి సంప్రదించాలన్నారు.