Breaking News

జి.మాడుగుల:పెదలోచలి పంచాయితీలో బీజేపీ ప్రజా పోరుయాత్ర.

0 20

 జి.మాడుగుల:పెదలోచలి పంచాయితీలో బీజేపీ ప్రజా పోరుయాత్ర.


ఈరోజు సోమవారం బీజేపీ ప్రజా పోరు యాత్ర 8 వ రోజు జీ.మాడుగుల మండలంలోని పెదలోచలి పంచాయతీలో గొడుగుమామిడి లో పర్యటన చెయ్యడం జరిగింది. ఈ యాత్ర ఆదివారం ఉదయం నుండి పాడేరు నియోజకవర్గ యాత్ర ఇంచార్జి కుడా కృష్ణారావు ఆధ్వర్యంలో, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు లకే బాలయ్య దొర అధ్యక్షతన ప్రజా పోరు వీధి సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షుడు,కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురుసా ఉమామహేశ్వరరావు,బీజేపీ ఎస్సి మోర్చా కోనసీమ జోనల్ ఇంచార్జ్ రవికుమార్ పెనుమాక హాజరయ్యారు. ప్రతీ గ్రామంలో ప్రజా సమస్యలపై ఆరా తీసి గ్రామస్తుల సమస్యలు లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. డ్రైనేజీ,మంచినీరు,ఫించన్లు,రేషన్ కార్డులు,కాఫీ కల్లాలు, తదితర అంశాలపై ప్రజలు సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో

బీజేపీ గిరిజన మోర్చా జోనల్ ఇంచార్జి కురుసా రాజారావు,రాష్ట్ర కాన్సిల్ మెంబర్ లకే బాలయ్య దొర, గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు సరమండ పొట్టిబాబు,పాడేరు యువ మోర్చా మండల కార్యదర్శి పాంగి భూషణం తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో గ్రామల్లో పెద్దలు, యువత,మహిళలు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.