Breaking News

జీడి మామిడి తోటలకు ఈ క్రాఫ్ట్ నమోదు చేయాలి.

0 22

 గిరిజనులకు జీడి మామిడి తోటలకు ఈ క్రాఫ్ట్ నమోదు చేయాలి.

 పెట్టుబడుల కోసం బ్యాంకు రుణాలు ఇవ్వాలి.

 పి.కోట్నిబిల్లి,రామన్నదొర పాలెం, డోలవాని పాలెం,కె.గదబ పాలెం గ్రామంలో జీడి మామిడి గిరిజన రైతులు,మహిళలు ధర్నా.


 అనకాపల్లి జిల్లా: నాన్ షెడ్యూల్ మండలాల్లో రావికమతం, రోలుగుంట,వి.మాడుగుల మండలాల పరిధిలో 70 గ్రామాల్లో నాలుగు వేల ఎకరాలు జీడి మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. చీమలపాడు పంచాయతీ 14 గ్రామాలు,టి.అర్జాపురం పంచాయతీ 2 రెండు గ్రామాలు,కొట్నబిల్లి 3 గ్రామాలు,వి.మాడుగుల మండలం ఉరలోవ రెవెన్యూ పరిధిలో 300 ఎకరాలు 8 గ్రామాలు ఆదివాసీ గిరిజనులు, 1500 మంది ఆదివాసీ గిరిజనులకు ఈ జీడి మామిడి తోటలే ప్రధాన జీవనాధారం.

 ఈ జీడి మామిడి తోటలకు ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఈ క్రాఫ్ట్ నమోదు చేయకపోవడంతో గతంలో జీడి మామిడి తోటలకు అగ్గి తెగులు, కాడ తెగులు, ప్రకృతి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు కారణంగా, జీడి మామిడి తోటలో పంట చేతికి రాని పరిస్థితి.

 ప్రైవేట్ వ్యాపారస్తుల నుండి అధిక వడ్డీలకు పెట్టుబడులు కోసం అప్పులు తీసుకొచ్చి జీడిమామిడి తోటలకు పెడితే పంట చేతికి రాని పరిస్థితి. 

అప్పుడు గిరిజన రైతు సంఘం జీడి మామిడి తోటలకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ క్రాప్ నమోదు చేయకపోవడం వల్ల పంట నష్టం అంచనా వేయడానికి అవకాశం లేదని అధికారులు చెప్పారని, నేడు రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెల మొత్తం ఈ క్రాప్ నమోదు చేయాలని గ్రామ సచివాలయం వ్యవసాయ అధికారి కి ఆదేశాలు ఇచ్చినా నాన్ షెడ్యూల్ గిరిజనులు జీడి తోటలు మాత్రం నేటికీ ఆఖరి తేదీ దగ్గర పడుతున్న గిరిజన జీడి మామిడి తోటలకు మాత్రం ఈ క్రాఫ్ నమోదు చేయలేదని,ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని నాన్ షెడ్యూల్ గిరిజనుల ప్రధాన జీవనాధారమైన జీడి తోటలకు ఈ క్రాప్ నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. గోవిందరావు, మండల గిరిజన సంఘం కార్యదర్శి పాడి బెన్నయ్య, తూబే ఎర్రమ్మ, ధోని రాజేశ్వరి, అప్పల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.



             

Leave A Reply

Your email address will not be published.