Breaking News

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది-మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

0 22

 రాష్ట్రంలో అరాచక పాలన …?


వైసిపి పాలనలో అన్ని వర్గాల వారికి అన్యాయమే


మండిపుట్టులో బాదుడే బాదుడు కార్యక్రమం


– నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


అల్లూరి జిల్లా, పాడేరు న్యూస్:

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని పాడేరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా మండలంలో బర్సింగి పంచాయతీ మండిపుట్టు గ్రామంలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు మద్యాన్ని నిషేదిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మద్యంతో వ్యాపారం చేస్తూ ప్రజలను దోచేస్తున్నారని ద్వజమెత్తారు. ఉప్పు నుండి పప్పు వరకు నూనె నుండి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల వరకు అధిక రేట్లు పెంచి సామాన్యుడు నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి జాడే కనిపించడం లేదని అన్నారు. డ్వాక్రా రుణాలు మొత్తం రద్దు చేస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయడకపోవడమే కాకుండా రుణాలు కట్టిన గ్రూపు కాకుండా కట్టని గ్రూపులకు రుణాలు ఇస్తూ అక్క చెల్లెమ్మలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ఎ ఒక్క హామీలు నెరవేర్చలేదని అబద్ధపు హామీలతో అధికారం చేపట్టి అన్ని వర్గాల ప్రజలను అన్యాయం చేస్తున్నారని అన్నారు. అమ్మ ఒడి,చేయూత, వాహన మిత్ర తదితర పథకాలు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడున్నర ఏళ్లలో రాష్ట్రంలో అరాచక పాలన మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, హత్యలు, మాట్లాడిన వాడిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన కోనగిస్తున్నారని అన్నారు. సామాన్యులు బ్రతకాలంటేనే భయం పుట్టేలా రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని షాక్ ఇచ్చే విధంగా రేట్లు పెంచి ప్రజలపై ఈ వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని అన్నారు.మన రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అంతకంటే ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం, మండల తెలుగుదేశం యువత అధ్యక్షులు డుంబేరు విశ్వనాధం, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బుక్కా జగదీష్,తెలుగుదేశం పార్టీ యువనాయకులు కూడా రాజేష్, తంగుల రాంబాబు, రెగం చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.