Breaking News

పాత్రికేయుని ప్రథమ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు చీరలు,దుప్పట్లు పంపిణీ.

0 21

 పాత్రికేయుని ప్రథమ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ. 


అల్లూరి జిల్లా,జి.కె వీధి మండలంలో ఆంధ్రభూమి పత్రిక విలేకరి(రాము)గా పనిచేసిన ముక్కలి రామచంద్రరావు ఇటీవలే సంవత్సరం క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో అతని ప్రథమ వర్ధంతి సందర్భంగా జీకే వీధి మండలంలో సుమారుగా 100 మంది వృద్ధులకు ఈరోజు చీరలు, దుప్పట్లు మీడియా మిత్రుల బృందం ఆధ్వర్యంలో అందించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ బోయిని కుమారి, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, వైసిపి పార్టీ మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్,పిఎసిఎస్ అధ్యక్షుడు వసపరి ప్రసాద్,స్థానిక సర్పంచ్ సుభద్ర,అరుణ్, రాజేష్, ప్రజాప్రతినిధులు, ప్రజలు,అభిమానులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.