Breaking News

ఫ్యాక్టరీ పరిరక్షణకు మహాజన సభలో నిలదీయండీ:సిపిఎం

0 16

 ఫ్యాక్టరీ పరిరక్షణకు మహాజన సభలో నిలదీయండీ:సిపిఎం

వెంకన్న 

ఈనెల 30 న గోవాడ ఘగర్ ప్యాక్టరి మహాజన సభలో ప్యాక్టరి పరిరక్షణకు రైతులు నిలదీయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న పిలుపునిచ్చారు. జిల్లాలోని నాలుగు ఘగర్ ప్యాక్టరిల్లో తెలుగు దేశం పార్టీ హయాంలో ఒకటి మూత వేస్తే,దానికి పోటిగా వైసీపీ రెండు ప్యాక్టరీలు మూత వేసిందని తెలిపారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థిలు మునుపు ఎన్నడు లేదన్నారు.చోడవరం సహకార చక్కెర కర్మాగారం రైతులకు గత సీజన్లో సరఫరా చేసిన చెరుకు పేమెంట్లు పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితి ఆప్కాబ్ కు నెలకొందని తెలిపారు. ఫ్యాక్టరీ చరిత్రలో మునుపెన్నడూ లేని పరిస్థితులు దాపురించాయని తెలిపారు. మహాజన సభ జరిగే సమయానికి రైతులకు ఇవ్వవలసిన చెల్లింపులు మొత్తంగా చెల్లించి, అదనపు ప్రోత్సాహక ప్రకటన కోసం రైతులు ఎదురుచూస్తున్నారని,కానీ ఈ ఏడాది తాము సరఫరా చేసిన చెరుకు రూ.2,500 చొప్పున ఇవ్వవలసిన బకాయి సుమారు రూ. 42 కోట్ల ఆలస్యం అయ్యిందని అన్నారు.ఈ నెల 30వ తేదీన మహాజన సభ జరుపుతామని ఇప్పటికే ఫ్యాక్టరీ వర్గాలు ప్రకటన చేశాయని. మరో 2 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో రైతులకు బట్వాడా చేయవలసిన సొమ్ము సమకూర్చడంలో సఫలీకృతం అవుతుందో లేదో చూడలన్నారు.

ప్రభుత్వం నుండి సరైన సహకారం లేక పోగా సివిల్ సప్లై ద్వారా ఫ్యాక్టరీ నుండి తీసుకెళ్లిన పంచదారకు బకాయి సుమారు రూ.18 కోట్ల వరకు ఉందన్నారు. ప్రభుత్వం బకాయి చెల్లించిన కొంత మంది రైతులకు చెల్లింపులు జరిగి ఉండేవని,కేంద్రలో బిజెపి ప్రభుత్వం విధించిన షరతుల వల్ల నెలకు 25 వేల క్వింటాళ్ల పంచదారకు మించి అమ్మకాలు చేపాట్టలేని పరిస్థితి

 నెలకొందని అన్నారు.బహిరంగ మార్కెట్లో పంచదారను అమ్ముకొనే స్థితి దాపురించిందన్నారు.ప్రస్తుతం ఫ్యాక్టరీలో 30 కోట్ల విలువైన రూపాయలు పంచదార నిల్వ ఉందని బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి వీలు ఉన్నట్లయితే నిల్వలు ఒకేసారి అమ్ముకోవచ్చునని నిబంధనలు అడ్డురావడంతో నిల్వ పేరుకుపోయాయి. ప్రతి ఏడాది పంచదార బస్తాల నిల్వలపై

తీసుకువచ్చి రైతులకు ముందుగా పేమెంట్లు చెల్లించేవారని, తీసుకున్న రుణానికి ఏడాదికి సుమారుగా 18 కోట్ల రూపాయలు వడ్డీ రూపేనా చెల్లించేవారని ఈ ఏడాది అప్పు తీసుకుని రాకపోవడం వల్ల వడ్డీ భారం తగ్గిందని,కాని పేమెంట్లు బట్వాడాలో

25 వేల మంది రైతులతో కూడిన ఫ్యాక్టరీ మహాజన సభ పాలక ప్రతిపక్ష పార్టీలకు విమర్శల వేదికగా జరుగుతూ వస్తూ ఉన్నది అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ లాంటి నాయకులు ఈ ఫ్యాక్టరీలో పరిధిలో ఉండి కూడా ఇప్పటివరకు రైతులకు బట్వాడా చేయకుండా మహాజన సభ నిర్వహిస్తే రైతులకు సమాధానం చెప్పవలసిన బాధ్యత వీరి పైనే ఉంటుందని అన్నారు. పూర్తిస్థాయిలో పేమెంట్లు ఇవ్వలేని దానిపైన ప్యాక్టరి పరిరక్షణకు రైతులు మహాజన సభలో ప్రభుత్వాన్ని ఎండ గట్టాలని కోరారు. గత ఏడాది రెండు లక్షల 75 వేల టన్నుల చెరుకు క్రషింగ్ జరిపిందని, గతం కంటే ఈ ఏడాది ఫ్యాక్టరీ పరిధిలో

చెరుకు విస్తీర్ణం సాగు తగ్గిందన్నారు. ఫ్యాక్టరీ టన్ను చెరుకు కిచ్చే 2500 రూపాయలు గిట్టుబాటు కాకపోవడంతో చాలా మంది రైతులు చెరుకు సాగుకు దూరమయ్యారనీ,పేమెంట్లు సకాలంలో చెల్లించకపోవడంతో కొంతమంది రైతులు నిరుత్సాహానికి గురిఅయ్యి పంటకు దూరమయ్యారనీ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది రెండు లక్షల టన్నులు గానుగాట ఆడడం కష్టమేనని తెలిపారు.ప్రభుత్వాలు సహకార రంగాన్ని చిన్న చూపు చూడడం తాండవ ఎటికోప్ఫాక ప్యాక్టరీలు ముసి వేయడం దీనికి కారణమని అన్నారు.వేలాది కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేసే ప్రభుత్వాలు వంద కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్యాక్టరీకి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసినట్లయితే ఆర్ధికంగా నిలదొక్కుకునే అవకాశం ఉండేదని అదిశగా ప్రయత్నాలు చేయకపోవడం సహకార రంగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఇప్పటికే తాండవ ఏటికోప్పాక ప్యాక్టరీలు మూతపడ్డాయని, గోవాడను కూడా అదేపరిస్థితి దాపూరిస్తుందని, రైతులు అందోళన లో ఉన్నారని అందుకనే ప్యాక్టరి పరిరక్షణ కొరకు మహజన సభలో రైతులు నిలదీయాలని, ప్యాక్టరి పరిరక్షించుకోవాలని లేదంటే ప్యాక్టరి పరిధిలో రైతులకు భవిష్యత్తులో కష్టాలు తప్పవని వెంకన్న స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.