Breaking News

గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ట్రైకార్ చైర్మన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం.

0 16

 నేడు విజయవాడ కేంద్రం ‘గిరిజన సంక్షేమ శాఖ’ కార్యాలయంలో  “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్” సతక బుల్లిబాబు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసారు.


గడిచిన కాలంలో ‘ట్రైకార్’ నిధుల ద్వారా రాష్ట్ర గిరిజన నిరుద్యోగులకు, రైతులకు, మహిళలకు కల్పించిన జీవనోపాధి పై సమీక్షా సమావేశంలో ముఖ్య చర్చ జరిగింది. రానున్న రోజుల్లో గిరిజన ప్రజలు ఆర్ధికంగా బలోపేతం అవ్వడానికి ‘ట్రైకార్’ సంస్థ తరుపున ప్రభుత్వానికి ఎలాంటి అంశాలతో కూడిన నూతన ప్రతిపాదనను ప్రభుత్వానికి అందజేస్తే బాగుంటుందనే ఆలోచనలు చేసారు.


 ఈ సమావేశంలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్” సతక బుల్లిబాబు మాట్లాడుతూ ‘ట్రై-కార్’ అంటే గిరిజనుల సంస్థ అని, రాష్ట్రంలో ప్రతి గిరిజన కుటుంబం ఆర్ధికంగా మెరుగుపడాలని గిరిజన యువతకు జీవనోపాధి కల్పించే దిశగా ఈ సంస్థ పనిచేయాలని చెప్పారు. గతంలో గిరిజన సంస్థ నుంచి గిరిజన ప్రజలకు అందాల్సిన రాయితీలు అనధికారికంగా కొన్ని ప్రభుత్వాల ద్వారా బినామీల చేతిలోకి వెళ్లాయని, అలా జరగకుండా ఉండేలా ప్రతి ఒకరు బాధ్యత వహించాలని కోరారు. వైస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజనుల పక్షపాతి అని గుర్తుచేసారు.  “జాతీయ షెడ్యూల్ తెగల ఆర్ధికాభివృద్ధి సంస్థ” వారితో మాట్లాడి వారి తరుపున రాష్ట్ర గిరిజనులకు అందాల్సిన పథకాల కూడా అందజేసే విధంగా ట్రైకార్ సంస్థ పనిచేస్తుందని ఆయన వ్యక్తపరిచారు.


ఈ కార్యక్రమంలో ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర బాబు, జనరల్ మేనేజర్ మణికుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభాకర్,ట్రైకార్ డైరెక్టర్స్ ఈశ్వరమ్మ,చిన్నప్పదొర, రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర గిరిజన శాఖ ఏపీవోలు, డిటిడబ్ల్యుఓ ఐటిడిఏ ఏఓలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.