Breaking News

బీజేపీ తోనే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి. – బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.

0 19

 అల్లూరి వారసులు గిరిజన బిడ్డలు. 

బీజేపీ తోనే గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి.

– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.


అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి మండలం: అల్లూరి సీతారామరాజు వారసులు గిరిజన బిడ్డలు, అభివృద్ధి కి దూరంగా ఉన్న గిరిజన ప్రజలు మట్టిలో మాణిక్యాలు అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం పాడేరు నియోజకవర్గంలోని చింతపల్లి మండలం బొంగు గూడా లో ప్రజా పోరు యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.    ప్రజా పోరు యాత్ర పాడేరు ఇంచార్జి కుడా కృష్ణరావు, బీజేపీ చింతపల్లి మండల అధ్యక్షుడు జైతి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన  మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో  టూరిజం అభివృద్ధి కి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి నిధులు ఇస్తుంది భారత ప్రభుత్వం అని,నరేంద్ర మోదీ నాయకత్వంలో స్వచ్ఛమైన పాలన బీజేపీకే సాధ్యం అని అన్నారు.అల్లూరి సీతారామరాజు నడయాడిన ఈ ప్రాంతంలో లంబసింగి, తాజంగి టూరిజం అభివృద్ధి అవుతుంది అని, గిరిజన ప్రాంతాల్లో యువతకు అవకాశాలు వస్తాయని, గిరిజన మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాము అని, బీజేపీ కి ఈ ప్రాంతాల్లో బలమైన కార్యకర్తలు ఉన్నారని, మారుమూల గ్రామాల్లో కూడా బీజేపీ అభివృద్ధి చేస్తోందన్నారు. బీజేపీ కి మద్దతు ఇవ్వాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు కమలం గుర్తుకు ఓటు వేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు స్పూర్తితో ఉద్యమిద్దాం అల్లూరి వారసులు మీరు మీకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో రహదారుల విస్తరణకు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురుసా ఉమామహేశ్వరరావు,జిల్లా ఇంచార్జి పరుసరామరాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ, గిరిజన మోర్చా జోనల్  ఇంచార్జి రాజారావు, ఎస్సి మోర్చా కోనసీమ జోనల్ ఇంచార్జి రవికుమార్, పెనుమాక ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాకరాపల్లి సుబ్రహ్మణ్యం, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోనంగి బాలయ్య పడాల్,ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు రవికుమార్, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె. శ్రీనివాసరావు,దుక్కేరి.ప్రభాకరరావు బీజేపీ అరకు జిల్లా కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి అధిక సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రజా పోరు యాత్రలో విష్ణు వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు యువకులు బీజేపీ లో చేరారు.

Leave A Reply

Your email address will not be published.