Breaking News

5 రోజుల రిలే నిరాహార దీక్షలో 4వ రోజు వినూత్న నిరసన తెలిపిన టిడిపి నాయకులు.

0 20

 టిడిపి 5 రోజుల రిలే నిరాహార దీక్షలో 4వ రోజు వినూత్న నిరసన తెలిపిన టిడిపి నాయకులు.


పాడేరు నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మోకాళ్ల పై కూర్చొని అర్ధ నగ్న నిరాహారదీక్ష.


ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కొనసాగించాలని నినాదాలు.


పీవీటీజీ కులానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది.


స్థానిక వైసిపి ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి కులపిచ్చి ఉంది.


అణగారిన వర్గమని బాబురావు ను ఎంపీపీ పదవి నుంచి తొలగించారు.


– పాడేరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.అల్లూరి జిల్లా,పాడేరు న్యూస్:


ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తొలగించడానికి నిరశిస్తూ తెలుగుదేశం పార్టీ ఐదు రోజుల రిలే నిరాహార దీక్షలో నాలుగవ రోజు చింతపల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో వినూత్న రీతిలో పాడేరు నియోజకవర్గ ఇంచార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని అర్థనగ్న నిరాహార దీక్ష చేపట్టి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం ముఖ్యంగా గిరిజనుల పక్షాన పోరాటం చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని గిరిజనులంతా ఎప్పుడెప్పుడా ఈ జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఎదురుచూస్తున్నారని అన్నారు. మీరు పేర్లు మార్చడం కాదు మీకున్న స్థాయి, హోదాని, మీకున్న పేర్లు భూస్థాపితం చేసే రోజులు దగ్గర పడ్డాయని జగన్మోహన్ రెడ్డికి హెచ్చరించారు. ఆంధ్ర రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చూస్తున్నామని స్వాతంత్ర్యం ముందు బ్రిటిష్ వాళ్లు మన భారతీయులను ఎలా హింసించారో మనకు స్వేచ్ఛ లేకుండా ఎలా చూసారో అంతకంటే ఎక్కువ దుస్థితి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన చూస్తున్నామన్నారు. గ్రామ స్వరాజ్యం అంటే ఒక ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను గౌరవం లేనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నామని అన్నారు.


చింతపల్లి ఎంపీపీ వంతల బాబూరావును, ఎంపీపీ పదవి నుంచి తొలగించడం అన్యాయమన్నారు.ఎంతో వెనుకబాటు పీవీటీజీ వర్గానికి చెందిన బాబూరావుకు అన్యాయం జరిగిందన్నారు.

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి కులపిచ్చి ఉందని ఆరోపించారు. కేవలం పీవీటీజీ కులమని, అణగారిన వర్గమని బాబూరావును పదవి నుంచి తొలగించారని విమర్శించారు. పీవీటీజీ సోదరులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం తొలగించినటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును ప్రజల కోరికను బట్టి జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకుని యూనివర్సిటీ పేరు ఉంచితే మంచిదని లేదంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును కొనసాగించడం ఖాయం అన్నారు. నేడు సర్పంచుల పరిస్థితి చూస్తున్నాం. గాంధీ జయంతి రోజున ప్రజా ప్రతినిధులు భిక్షాటన చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందన్నారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులతో పాటు వారికి ఇచ్చే జనరల్ ఫండ్ ను కూడా ఈ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం దోచెయ్యడంతో పంచాయితీల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు పోలుపార్తి గోవిందరావు,( మాస్టర్ ), రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి గబ్బాడ సింహాచలం,రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు సోమేలి చిట్టిబాబు, అరకు పార్లమెంట్ మహిళా కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి,చింతపల్లి మండల అధ్యక్షులు కిల్లో పూర్ణచంద్రరావు, జి. మాడుగుల జీకే.వీధి మండల అధ్యక్షులు వంతల కొండలరావు ముక్కల రమేష్, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంగ పూజారి శివకుమార్, ఐ టి డి పి అధ్యక్షులు బుద్ధ జ్యోతి కిరణ్, గ్రామ కమిటీ రీమలి ఆనందరావు, పాటి బింబాబు,కిడారి.బింబాబు,వంజరి.చిరంజీవి, టిడిపి నాయకులు సోమేశ్, భూషన్, రామకృష్ణ, రాము, శ్రీధర్, సుదర్శన్, లోకేష్, నాగేశ్వరరావు, భీమన్న, మహేష్ మోహన్, టిడిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.