Breaking News

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజన మహిళలకు ఉద్యోగావకాశాలు.

0 16

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ఎన్నో ఏండ్లుగా, శిక్షణ ఇవ్వడం తద్ద్వారా నైపుణ్యం అభివృద్ధి ఉద్యోగాలు కలిపించడం, ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు 

ఇప్పుడు టాటా టెక్నాలజీతో సమన్వయంతో అల్లూరి సీతారామరాజు

జిల్లా పోలీసులు ఇప్పుడు 2020,2021,2022లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికలకు (వయస్సు 18 నుండి 20 సంవత్సరాలు) అచ్యుతాపురం ప్రశాంతి పాలిటెక్నిక్‌లో కళాశాలలో 12 రోజులు ఉచిత శిక్షణ ఆహార వసతి ఇచ్చి వారికి టాటా టెక్నాలజీస్ హోసూరు దగ్గర తమిళనాడు లో ఉద్యోగాలు కలిపిస్తున్నారు.

టాటా టెక్నాలజీస్ క్యాంపస్ 600 ఎకరాల్లో స్థాపించబడిందని, ఈ క్యాంపస్‌లో ఉద్యోగం పొందిన వారికి 17000/- (CTC) రూపాయిలు జీతం వారు వారి ఉన్నత చదువులు కొనసాగించవచ్చు అని, విద్యార్థులు టాటా టెక్నాలజీ నుండి నేరుగా ఆఫర్ లెటర్ పొందుతారు. తద్వారా వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది. వారు పెద్ద MNC కంపెనీల వంటి పి ఎఫ్ ఇతర అన్ని అలవెన్సులను కూడా పొందుతారు అని, వారికి ఆహార వసతి, ప్రయాణ సౌకర్యాలు కూడా సబ్సిడీలో లభిస్తాయి అని చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ తెలిపారు.

ఈ సందర్భంగా చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ మాట్లాడుతూ గిరిజనులు ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు మహిళా పోలీసు లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.