Breaking News

వైసీపీ ది ప్రజా సంక్షేమ పాలన -పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.

0 16

 వైసిపి ది ప్రజా సంక్షేమ పాలన-పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.


వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా సంక్షేమ పాలనని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. 

ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి పేదవాడి పెదవిపై చిరునవ్వులు కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

 పేదవాళ్లను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.

 తమది పేదల, గిరిజన పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.

 పాడేరు మండలంలో లగిశపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని గురుపల్లి,తోటల గున్నలు,చావడి మామిడి, ముల్లు గురువు, ఎర్ర గొప్ప (ఈడెలగుంది) గ్రామాల్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పాల్గొని గడప గడపకూ తిరుగుతూ ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ప్రజలకు చేసిన లబ్ధిని వివరించారు.

 ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే కి ప్రజలు సాదర స్వాగతం పలికారు.

 తమ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన ఎమ్మెల్యే కి స్థానిక ప్రజలు వారి సమస్యలను తెలియజేస్తూ… ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని వివరిస్తూ తమ గ్రామానికి, తమ గడపకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

 ఈ సందర్భంగా మొత్తం 188 గడపలను ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సందర్శించారు. 

ప్రతి గడప తలుపూ తడుతు వారికి ప్రభుత్వం ఈ మూడేళ్లలో చేసిన మేలును వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సాగింది. 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సొన్నతి రత్నకుమారి, స్థానిక సర్పంచ్ వనుగు బసవన్నదొర, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ఎంపీటీసీ లకే రామకృష్ణ పాత్రుడు, లగిశపల్లి సర్పంచ్ లకే పార్వతమ్మ, వంజంగి సర్పంచ్ వంతల బొంజుబాబు

 ఎంపీటీసీలు చల్లా చిట్టెమ్మ,సన్యాసిరావు, బొంజు బాబు, నరసింహమూర్తి,

 సర్పంచులు సీదరి రాంబాబు, వంతల రాంబాబు, గబ్బంగి సర్పంచ్ నీలకంఠం నాయుడు,

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్వి రమణమూర్తి,

సిరగం దశమూర్తి, కొతంగి సూరిబాబు, కన్నా పాత్రుడు, సుదర్శన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఎం.సరస్వతి, కొడ సుశీల, సాలేగు భారతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.