Breaking News

కొయ్యూరు:ఎం.మాకవరం లో సర్పంచ్ అద్యక్షతన గ్రామసభ.

0 15

 కొయ్యూరు:ఎం.మాకవరం లో సర్పంచ్ అద్యక్షతన గ్రామసభ.


 అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం,ఎం.మాకవరం పంచాయతీలో సోమవారం సర్పంచ్ కోడ చింతల్లి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రధాన ఎజెండా గా ఉపాధి హామీ పనులు, డ్రైనేజీ క్లీనింగ్ పనులు, ల్యాండ్ మ్యుటేషన్ వర్క్స్ చర్చించడం జరిగింది. రైతు భరోసా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి ఇలా అన్ని పథకాలు అర్హత ఉన్న వారికి అందుతున్నాయా లేదా అని సర్పంచ్ కూడా చింతల్లి,రాజుబాబు, ఎంపిటిసి పొడుగు రత్నం ప్రజలను ముఖాముఖిగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ ఏర్పాటు చేసినందుకు గాను అలాగే సచివాలయ సిబ్బందికి వల్ల జాబ్ రెగ్యులర్ చేసినందుకు, శాలరీ 15 వేల నుండి 30 వేల వరకు పెంచినందుకు గాను, ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రికి సచివాలయ స్టాఫ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపుతూ, ఎల్లప్పుడూ జగనన్నకి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు సూరిబాబు,అచ్చిరాజు, బంగారయ్య, పెద్దబ్బాయి వార్డు మెంబర్స్ రాంబాబు, దిలీప్,వీరమని, త్రిమూర్తులు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది కృష్ణ, భూమయ్య (టెక్నికల్ అసిస్టెంట్), సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.