Breaking News

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం:ఎమ్మెల్యే ఉమాశంకర్

0 25

 రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే ఉమాశంకర్ 

ఉమాశంకర్ గణేష్(ఎమ్మెల్యే) 

అనకాపల్లి జిల్లా,నర్సీపట్నం:

రాష్ట్రం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం అని స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా అమరావతి శాశ్వత రాజధానిగా కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని దీన్ని అడ్డుకోవాలని అమరావతి రైతుల పేరిట ప్రయత్నాలు చేస్తున్నారని అమరావతి నుండి అరసవెల్లి వరకు చేపట్టిన పాదయాత్ర చేసి ఉత్తరాంధ్రలో విధులు సృష్టించాలని ఇలా చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ద్రోహి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్రలో విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు. రౌడీ మూకలు, గూండాలు పాదయాత్ర పేరుతో ఎంతమంది వచ్చినా ఉత్తరాంధ్రకు రావాలని చూస్తే వేలాది గా వచ్చి అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. ఎటువంటి విధ్వంసాలు జరిగిన ఏం జరిగిన దాని కారణం ఉత్తరాంధ్ర ధ్రోహి అయ్యన్నపాత్రుడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం మేరకు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఇప్పటికే గ్రామాల్లో పాలాభిషేకాలు నిర్వహించడం అందరికీ తెలిసిందేననీ మూడు రాజధానులు స్వాగతించడంతోనే నియోజకవర్గంలో ప్రజలు స్వాగతిస్తున్నారని దీనిలో భాగంగానే విజయదశమి రోజు దేవాలయాల్లో మూడు రాజధానులకు దేవుని ఆశీర్వాదాలు ఉండాలని ఉద్దేశంతో పూజలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే ఈనెల ఏడో తారీఖు నుండి బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని అమరావతికి వ్యతిరేకం కాదని అమరావతి తో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం చేయాలనే మేము కోరుతున్నామని ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.