Breaking News

సంవత్సరం క్రితం జరిగిన మర్డర్. వీడిన మిస్టరీ.

0 19

 క్రైమ్ స్టోరీ చింతపల్లి 


సంవత్సరం క్రితం జరిగిన మర్డర్. వీడిన మిస్టరీ.


చెదల కాంతమ్మ మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు.


 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సంవత్సరం క్రితం చెదల కాంతమ్మ అనే మహిళ మిస్సింగ్ కేసులో అల్లూరి జిల్లా ఎస్పి సతీష్ కుమార్ ఆదేశాల మేరకు చింతపల్లి ఏ ఎస్ పి పర్యవేక్షణలో చింతపల్లి, జీకే వీధి సీఐ ల సహకారంతో అన్నవరం ఎస్ ఐ సాయికుమార్ చాకచక్యంగా సంవత్సరం క్రితం మిస్సింగ్ ఫిర్యాదును నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి వివరాలు సేకరించారు. సంవత్సరం క్రితం మిస్సింగ్ ఫిర్యాదును


 చెదల కాంతమ్మ ను ఇనుప గొడ్డలి తో కొట్టి చంపేసి ప్రక్కనే ఉన్న పసుపు దొడ్డి గోతిలో పూడ్చి పెట్టారని నిందితులను పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితులను పట్టుకున్న అన్నవరం ఎస్సై ను, చింతపల్లి, జీకే వీధి సీఐలను ఏ ఎస్ పి అభినందించారు.


వివరాలు చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలం కుడుమ సారి పంచాయితీ సంపంగి పుట్టు గ్రామానికి చెందిన ఎస్టీ భగత కులసుడైన వండలం గోపాల్ అనే 21 సంవత్సరాల వ్యక్తి,

జి.మాడుగుల మండలం, లువ్వాసింగి పంచాయతీ, చిట్టంపుట్టు గ్రామానికి చెందిన ఎస్టీ భగత కులస్తురాలైన 20 సంవత్సరాల కోరాబు లక్ష్మి అనే ఆమె.. వీరిద్దరూ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.


అయితే వండలం గోపాల్ కి అదే గ్రామానికి చెందిన సంపంగి పుట్టులో చెదల నారాయణమ్మ చిన్న కుమార్తె అయిన చెదల కాంతమ్మకి పెళ్లి సంబంధం చూడటం జరిగింది.

హత్యకు గురైన కాంతమ్మ ఫోటో 

దీంతో లక్ష్మి నన్ను ప్రేమించి ఆమెను ఎలా పెళ్లి సంబంధం చూసావని, నీపేరు రాసి నేను చచ్చిపోతానని గోపాల్ ని బెదిరించి, మనమిద్దరం కలిసి ఉండాలంటే చెదల కాంతమ్మ ను అడ్డు తొలగించాలని గోపాల్ పై లక్ష్మి ఒత్తిడి తెచ్చిందని,

దానికోసం వారిద్దరూ గత సంవత్సరం వినాయక చవితికి ఒక నెల రోజులు ముందు లక్ష్మీ ఇంటి వద్ద ఇద్దరు కూర్చొని వినాయక చవితి రోజు అయితే రెండు గ్రామాల ప్రజలు మండపాల దగ్గర ఉంటారని, ఆరోజు లక్ష్మీ ఇంటికి చెదల కాంతమ్మ ని తీసుకొని వచ్చి చంపేందుకు పథకం పన్ని వారి పథకం ప్రకారం వినాయక చవితి రోజున 10:9:2021న లక్ష్మి చెదల కాంతమ్మ ఇంటికి వెళ్లి గోపాల్ ని పెళ్లి చేసుకో.. నేను మీ మధ్య ఉండనని చెదల కాంతమ్మ తో నమ్మ పలికి లక్ష్మీ ఇంటి వరకు దిగబెట్టమని అడగడంతో చెదల కాంతమ్మ, లక్ష్మిలు మధ్యాహ్నం ఒంటిగంటకు కాంతమ్మ ఇంటిదగ్గర బయలుదేరి నడుచుకుంటూ చిట్టంపుట్టు లో గల లక్ష్మి ఇంటికి చేరుకొని ఆ సమయంలో లక్ష్మీ అమ్మ, చుట్టుప్రక్కల ఇల్లుల వారు వినాయక మండపానికి పూజకు వెళ్లినందున లక్ష్మీ ఇంట్లో చుట్టుప్రక్కల ఎవరూ లేనందున సుమారు మధ్యాహ్నం రెండున్నర గంటలకు లక్ష్మి ఇంటిలో చెదల కాంతమ్మ కూర్చొని ఉండగా పథకం ప్రకారం లక్ష్మి, గోపాల్ అప్పటికే సిద్ధంగా ఉంచిన ఇనుప గొడ్డలి వెనుక పిడి భాగంతో బలంగా చెదల కాంతమ్మ తల వెనుక భాగంలో లక్ష్మీ కొట్టగా చెదల కాంతమ్మ కిందపడి అమ్మా! అని అరిచి గిలగిల కొట్టుకుంటూ ఉండగా ఇంతలో ఇంటి బయట కాపలాగా ఉన్న గోపాల్ చెదల కాంతమ్మ ఆర్తనాదాలు విని వెంటనే ఇంట్లోకి వెళ్లి చెదల కాంతమ్మ నోరుని, ముక్కును ఊపిరి ఆడకుండా నొక్కగా లక్ష్మి మరలా మరో దెబ్బ గొడ్డలితో బలంగా చెదల కాంతమ్మ తలపై కొట్టగా అక్కడికక్కడే చనిపోయింది. చెదల కాంతమ్మ శవం ఎవరికీ దొరకకూడదని లక్ష్మీ ఇంటికి కుడి వైపున భూసరి రంగారావు పసుపు దొడ్డికి ఆనుకొని ఉన్న పనస చెట్లు కిందన దుంపల కోసం తవ్విన గోతిలో గోపాల్ ,లక్ష్మి గొబ్బంతో మరో కొంచెం లోతు తవ్వి చెదల కాంతమ్మ శవాన్ని రగ్గులో చుట్టి పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తిరుగుతున్నారు. చెదల కాంతమ్మ కనిపించకపోవడంతో లక్ష్మి మీద అనుమానంతో చెదల కాంతమ్మ తల్లి అన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని, లక్ష్మీ, గోపాల్ అనుమానస్పద ప్రవర్తనతో గ్రామ పెద్దలలో పంచాయితీ పెట్టగా పంచాయతీలో లక్ష్మీ,గోపాల్ పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకొని గత కొంతకాలంగా రాజమండ్రి దగ్గర ఆలమూరులో చేపల చెరువులో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు.

అప్పటినుండి వీరిద్దరిపై నిఘా ఉంచి సంపంగి పుట్టు, చిట్టంపుట్టు గ్రామాలలో లక్ష్మి,గోపాల్ గురించి ఎంక్వైరీ చేస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా అన్నవరం పోలీసులు వారిద్దరిని 6:10:2022న అరెస్టు చేసి సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న మిస్సింగ్ కేస్ మిస్టరీని ఛేదించి సంవత్సరం క్రిందట చంపి పూడ్చిపెట్టిన చెదల కాంతమ్మ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ కేసు మిస్టరీని ఛేదించడంలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన అన్నవరం ఎస్ఐ పి. సాయికుమార్, ఏ ఎస్ ఐ జి.రమణమూర్తి, పోలీసు సిబ్బంది ఎన్. కన్నారావు, కె.కొండందొర,వై.శంకర్రావు,డి.రాము లను అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, చింతపల్లి ఏఎస్పి కె పి ఎస్ కిషోర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.