Breaking News

జోరు వానలోనే సాగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

0 21

 జోరున వానలోనే సాగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

 ప్రజల నుంచి అనూహ్య స్పందన.

 ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమన్న శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.


అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు:

ఒక పక్క జోరున వర్షం కురుస్తున్నా సరే.. గడపగడపకు మన ప్రభుత్వం కొనసాగుతూనే ఉంది…జనం కూడా ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కి అడుగగడుగునా ఆదరణ చూపుతూనే ఉన్నారు. పాడేరు మండలం లగిశపల్లి గ్రామ సచివాలయం పరిధిలోని వంజంగి పంచాయ‌తీ పరిధిలోని వి.కొత్తూరు, కొత్తవలస, పోతురాజు మెట్ట, సంపాలు, రాసమెట్ట గ్రామాల్లో పాడేరు శాసనసభలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.


కార్యక్రమం ప్రారంభం నుంచి జోరున వర్షం కురుస్తూనే ఉంది.. ఒకపక్క వర్షం కురుస్తున్నా ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి మాత్రం ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించారు. ఐదు గ్రామాల ప్రజలు నుంచి కూడా అనూహ్య స్పందన లభించింది.

గడపగడపకు శాసనసభ్యులు వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలు పొందిన లబ్ధిని అడిగి తెలుసుకుంటూ… ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే ఎక్కడి కక్కడే వాటి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఎంత అయితే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యలను గుర్తించడం జరుగుతుందని ఇటువంటి కార్యక్రమం చేయాలని దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎల్ రామకృష్ణ పాత్రుడు, సర్పంచులు S.రాంబాబు,ఎల్ పార్వతమ్మ, వి.రాంబాబు.మాజీ సర్పంచ్ లు కె.బొంజుబాబు,కె.సూరిబాబు, ఎం.కన్నా పాత్రుడు,వ్యవసాయ కమిటీ చైర్మన్ సరస్వతి,ఉప సర్పంచ్ లు పి.బుల్లేశ్వరి,వి.సుగుణ,సీనియర్ నాయకులు పి.సత్యనారాయణ జి.లింగమూర్తి,ఎస్. స్వామి ఎస్.బోడరాజు, బి.రాజారావు,కె. సుశీల,పి.సత్యారావు,కె.రాజారావు, జి.రాజారావు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.