Breaking News

ఎమ్మెల్యే కి వ్యతిరేకంగా పివిటిజి సామాజిక వర్గీయులు భారీ ర్యాలీ.

0 20

 చింతపల్లిలో పి వి టి జి సామాజిక వర్గం భారీ ర్యాలీ.


 అల్లూరి జిల్లా, పాడేరు నియోజకవర్గం, చింతపల్లి లో సంవత్సర కాలం ఎంపీపీ గా కొనసాగిన తరువాత కొన్ని కారణాల వల్ల బాబూరావు ను ఎంపీపీ పదవి నుండి తొలగించారు.

ఈ నేపథ్యంలో తనను అనగారిన వర్గమని, కావాలనే తనను తన పార్టీ నేతలే ఈ విధంగా చేశారని బాబూరావు అన్నారు.

ఈ మేరకు పి వి టి జి సామాజిక వర్గీయులు పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

 ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ

 కుల రాజకీయాలు మానుకోవాలి అంటూ 

 పివిటీజి కులానికి చెందిన గిరిజనులందరూ చింతపల్లి నడిరోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మర్రి గురుమూర్తి,  జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు కొర్ర సూరిబాబు, పార్లమెంటు యూ డబ్ల్యూ ఇసి అధ్యక్షులు పాంగి శ్రీను, కొయ్యూరు బిజెపి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అర్జున్ రెడ్డి, జి మాడుగుల ఎంపిపి కొర్ర కొండబాబు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు పాంగి రామ్, జనసేన మండల అధ్యక్షులు వంతల బుజ్జిబాబు, జికే వీధి సిపిఎం నాయకులు కొర్ర బాలయ్య, పాడేరు వైసిపి నాయకులు పాంగి నవీన్, సోమేష్, పెదబయలు టిడిపి మండల కార్యదర్శి పాంగి నాగేష్, వైసిపి సర్పంచ్ తమన్నా, ఎంపిటిసి పాంగి రామారావు, ముంచంగిపుట్టు వైసిపి సర్పంచ్ వంతల రాజారావు అన్ని మండలాల వారీగా యువకులు, గ్రామ ప్రజలు పాల్గొని నిరసన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.