రహదారికి ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించిన అల్లూరి యువ గిరిజన సేవా సంఘం టీం.
అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం లో అల్లూరి యువ గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో మర్రిపాలెం నుండి గధబపాలెం వరకు 5 కిలోమీటర్లు మేర రహదారి కి ఇరువైపులా ఉన్న తుప్పలను తొలగించడం జరిగింది.
మర్రిపాలెం,జోగుంపేట మీదుగా రోజూ అనేకమంది వాహనదారులు ఇదే రహదారి మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు.
అయితే ఈ మధ్య కురిసిన వర్షాలకు రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఎదురెదురుగా వస్తున్న వాహనాలు తొందరగా కనిపించ లేనంతగా ఉన్నాయి.
ఇది గమనించిన మల్లవరం గ్రామానికి చెందిన అల్లూరి యువ గిరిజన సేవా సంఘం టీం సభ్యులు ఆ రహదారి మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా ఉండేందుకు ఈరోజు సుమారుగా ఐదు కిలోమీటర్లు మేర మర్రిపాలెం నుండి గదవపాలెం వరకు రహదారికి ఇరువైపులా పెరిగిన పిచ్చి తుప్పలను తొలగించారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు అల్లూరి యువ గిరిజన సేవా సంఘం టీం సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి యువ గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు టి.మల్లేష్,యు.లక్ష్మణ్ మాస్టర్,పి. మల్లయ్య మాస్టర్,కె.చిరంజీవి,ఎన్. చెల్లయ్య,పి.రాజుబాబు,కె.సన్నీ,టి. యువరాజ్,ఎన్.పవన్,యు.లక్ష్మణ్,ఎం.రాజుబాబు,జంపా రాంబాబు,టి. చందు,కూడా పెద్దబ్బాయి పాల్గొన్నారు.