Breaking News

వంజంగి హిల్స్ కు సాయంత్రం 05.30 తరువాత వాహనాలు నిషేధం. -జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

0 16

 వంజంగి హిల్స్ కు సాయంత్రం 05.30 తరువాత వాహనాలు నిషేధం.

-జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్


అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం: చింతపల్లి మండలం లోని వంజంగి హిల్స్ సందర్శనకు సాయంత్రం 05.30 తరువాత ఎటువంటి వాహనాలను అనుమతించమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం వంజంగి హిల్స్ సందర్శనకు వెళ్లిన టూరిస్టుల మిని బస్సు లోయలోకి జారిపోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్సీ సతీష్ కుమార్ తో కలిసి ప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు నాణ్యమైన సేవలందించాలని ఆదేశించారు. ప్రమాద పరిస్థితి, అందుకు దారి తీసిన కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక నుండి సాయంత్రం 05.30 నుండి ఉదయం వరకు వాహనాలు నిషేధం అమలులో ఉంటుందనీ, పోలీసు వారి అనుమతి పొందాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఆ ప్రాంతాన్ని ప్రమాదాలు జరుగు ప్రాంతంగా (accident prone area) ప్రకటించడం జరిగిందన్నారు. జరిగిన ప్రమాదం పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని, దర్యాప్తు చేపట్టామని ఎస్సీ సతీష్ కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.