Breaking News

జీకే.వీధి:గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన.

0 13

 అల్లూరి జిల్లా,గూడెం కొత్తవీధి మండలంలోని గూడెం కొత్త వీధి పంచాయతీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన.


ఈ కార్యక్రమంలో భాగంగా లంకపాకలు, పనసపల్లి, కొత్తూరు, గొందిపల్లి, ఈ.గొందిపల్లి పలు మారుమూల గ్రామాలలో మొత్తం గ్రామ సచివాలయం-1 పరిధిలో 219, గ్రామ సచివాలయం-2 పరిధిలో 305 గడపలను ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి సందర్శించారు.

ఈ మూడేళ్లలో ప్రజలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే వివరించారు. అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 15వ తేదీన పరిపాలన వికేంద్రీకరణ మూడు రాజధానులకు మద్దతుగా విశాఖపట్నంలో నిర్వహించనున్న విశాఖ గర్జనను విజయవంతం చేయాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశయానికి ప్రజా నిర్ణయానికి మద్దతు తెలపాలని ఆమె కోరారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిన కుమారి,వైసిపి మండల అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్, సర్పంచ్ కోర్ర సుభద్ర,ఎంపీటీసీలు పసుపులేటి నాగమణి, రాజులమ్మ,కృష్ణమూర్తి,వైస్ ఎంపీపీ దేవుడు,వైసిపి నాయకులు అరుణ్ కుమార్, ఆంజనేయులు,ఉప సర్పంచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.