Breaking News

అతి మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

0 35

అతి మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే.

వైసిపి ప్రభుత్వంపై, పాడేరు ఎమ్మెల్యే పై ఏమాత్రం తగ్గని ప్రజాదరణ.

మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో ఆశాభావం వ్యక్తం.


అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో ఈరోజు గ్రామ సచివాలయం 1, గ్రామ సచివాలయం 2 పరిధిలోని కుంకుమ పూడి, తీముల బంధ, పెద్ద అగ్రహారం, చిన్న అగ్రహారం, వాడమామిడి, చీపురు గొనెలి, చెరుకుంపాలెం, వీరవరం, నక్కల మెట్ట, నూతలు, గుమ్మలగుంది గ్రామాల్లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పాడేరు ఎమ్మెల్యే నిర్వహించారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందుతున్న తీరు గురించి ఆరా తీశారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి అధికారులకు సిఫార్సు చేశారు. ఈ రెండు సచివాలయాల పరిధిలో మొత్తం 450 గడపలను సందర్శించారు.

ఈ కార్యక్రమంలో జికే వీధి ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్, సర్పంచ్ కొర్ర సుభద్ర, ఎంపీటీసీలు పసుపులేటి నాగమణి, కొర్ర రాజులమ్మ,  వైస్ ఎంపీపీలు సప్పగెడ్డ ఆనంద్ , లోత దేవుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు వంతల ఆనంద్, సర్పంచ్ లు కుందేరి రామకృష్ణ, కంకిపాటి విజయ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జోరంగి ప్రసాద్ రావు, అంజిబాబు, అడపా విష్ణుమూర్తి, ఉప సర్పంచ్ సల్లంగి శ్రీధర్, ఎంపీటీసీలు పోతురాజు, కృష్ణమూర్తి, షేక్ దావీదు , మండల నాయకులు బోయిన వెంకట్రావు, కంకిపాటి గిరిప్రసాద్, బాబి, కృష్ణారావు, గబులంగి సతీష్, ఎంపీటీసీ మొట్టడం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.