చింతపల్లి విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు వెంకటలక్ష్మి.
అల్లూరి సీతారామరాజు జిల్లా,చింతపల్లి మండలం లోని కరాటే అసోసియేషన్ స్టూడెంట్స్ కొఫూకాన్ కరాటే క్లబ్ ని ఈరోజు మొదటిసారి సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టి సెల్ అధ్యక్షురాలు డాక్టర్ మత్స్యరాస వెంకటలక్ష్మి ని కరాటే మాస్టర్ బాకూరు పాండురాజు దుశాలువాతో సన్మానించారు. కరాటే క్లబ్ తరఫున ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కరాటే క్లబ్ ఇన్చార్జ్ బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్ సాగిన భవాని, పద్మ, మాజీ ఎంపీపీ బూసరి కృష్ణారావు, మాజీ సర్పంచ్ ఉల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ బుజ్జి, ఉమా పాల్గొన్నారు.