Breaking News

భారీ వర్షానికి వాగులో చిక్కుకున్న జిసిసి లారీ

0 15

 భారీ వర్షానికి వాగులో చిక్కుకున్న జీసిసి సరుకులు లారీ.

వాగులో చిక్కుకున్న జిసిసి లారీ కొట్టుకుపోకుండా కాపాడిన చుట్టుపక్కల గ్రామస్తులు.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని మారుమూల యూ.చీడిపాలెం పంచాయితీ, గ్రామంలో గురువారం జిసిసి సరుకులు దించి తిరిగి వస్తున్న సమయంలో భారీ వర్షం కురిసి గొట్టెలపాడు కాలువ దాటుతుండగా వాగు ఉధృతంగా రావడంతో ఆ వాగు వద్దనే లారీ ఇంజన్ ఆగిపోయింది.

ఎంతసేపటికి లారీ స్టార్ట్ కాకపోవడంతో వాగు ఉధృతికి లారీ మునిగిపోయే పరిస్థితుల్లో కలాసీల చొరవతో అక్కడి గ్రామస్తుల సహకారం తీసుకొని ఎట్టకేలకు అతి కష్టం మీద లారీని బయటికి తీయగలరు.

అయితే ఇదిలా ఉండగా సుమారు సంవత్సరం న్నర క్రితం ఈ గొట్టెలపాడు కాలువ వద్ద వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యే,ఎంపీ చొరవతో రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు యూ.చీడిపాలెం సర్పంచ్ దడాల రమేష్ అప్పట్లో మీడియా వారికి తెలిపారు. అయితే ఇప్పటివరకు అక్కడ వంతెన నిర్మాణం ప్రారంభం కూడా జరగలేదు.

ఈ గొట్టెలపాడు కాల్వ వద్ద వంతెన నిర్మాణం చేసినట్లయితే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లేదంటే వర్షాకాలంలో ఇలాంటి ఇబ్బందులు అనేకం ఎదుర్కోవాల్సి వస్తుందని సర్పంచ్ రమేష్ తెలిపారు. కనుక ఎమ్మెల్యే ఎంపీ చొరవ తీసుకొని వంతెన నిర్మాణం త్వరగా చేయాలని సర్పంచ్, అక్కడి ప్రజలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.