చింతపల్లి: పలు పంచాయితీలలో వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ.
వైఎస్సార్సీపీ పట్ట భధ్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదులో భాగంగా ఈరోజు అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం అంజలి శనివరం పంచాయతీ, కిటుముల పంచాయతీ లకు వెళ్లి ఓటర్లను నమోదు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండలం మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఉల్లి సత్యనారాయణ, పెదబరడ పంచాయతీ సర్పంచ్ సమిడే గోపాల్, కిటముల పంచాయతీ ఎంపిటిసి, వైస్ సర్పంచ్ సుర్ల అప్పారావు, వార్డు మెంబర్ మొదలగువారు పాల్గొన్నారు.