Breaking News

చింతపల్లి:రహదారి మంజూరు చేయండి సారూ!

0 16

రిపోర్టర్:లక్ష్మణ్ : స్వాతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మారుమూల గ్రామాల ప్రజలు సరైన రహదారి లేక వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం, గొందిపాకలు పంచాయతీ లోని ఎర్రవరం గ్రామానికి వెళ్లే రహదారి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బురద మయంగా మారింది.


దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహనదారులు అత్యవసర, నిత్యవసర సేవలు వినియోగించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క రహదారి సమస్యను పరిష్కరించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను వారు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.