Breaking News

రహదారి సౌకర్యం లేక మృతదేహాన్ని డోలి మోతతో తరలింపు.

0 16

 అనకాపల్లి జిల్లా నాన్ షెడ్యూల్ గిరిజన మండలమైన రావికమతం మండలం, చీమలపాడు పంచాయతీ, చలిసింగం గ్రామానికి చెందిన కిముడు చంటి (25) అవిహితుడు విశాఖ కేజీహెచ్ లో శనివారం ఉదయం మృతి చెందాడు.


 గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు.శుక్రవారం నర్సీపట్నం తీసుకువెళ్లగా కేజీహెచ్ కు తరలించారు.పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందాడు.

రహదారి సౌకర్యం లేక గ్రామస్తుల సాయంతో అతి కష్టంగా తల్లి తండ్రులు కిముడు సత్యారావు, రమణమ్మ డోలిలో గ్రామానికి తరలించారు.


 చలి సింగం గ్రామంలో 500 మంది జనాభా కలిగిన ఆదివాసీ గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామానికి 2018-19 సంవత్సరంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధుల నుండి మూడు కోట్ల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణం చేశారు. ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పి ఫారెస్ట్ అధికారులు రోడ్డు పనులను నిలుపుదల చేశారు. ప్రభుత్వ విప్ ప్రస్తుతం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మూడు కిలో మీటర్ల ఎత్తైన కొండ ఎక్కి చలిసింగం గ్రామాన్ని దత్తత గ్రామంగా తీసుకొని, నాకు ఎమ్మెల్యేగా ఓటు వేస్తే గెలిచిన వెంటనే మీకు రోడ్డు నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చారని, నేటికీ మూడున్నర సంవత్సరాలు అవుతున్నా ఆదివాసీ గిరిజనుల యొక్క అడవి బిడ్డలు డోలి మోతలు తప్పడం లేదని వాపోతున్నారు.

రహదారి నిర్మాణం చేయాలని గోవిందరావు డిమాండ్.


ఇప్పటికైనా పాలకులు గుర్తించి డోలు మోత లేకుండా రోడ్డు నిర్మాణం చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షులు కె.గోవిందరావు, మండల కార్యదర్శి సిహెచ్.శంకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.