Breaking News

కొయ్యూరు:బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 18

 అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం,కొయ్యూరు మండలంలోని కొత్త తుమ్మలబంధ,బొర్రంపేట,కర్ణికపాలెం,కంఠారం గ్రామాల్లో బాదుడే బాదుడు” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి

జగన్మోహన్ రెడ్డి రేట్లన్ని పూర్తిగా తగ్గిస్తామని చెప్పి గద్దెనెక్కి, గెలిచాక ధరలు పెంచి గుద్దులు గుద్దుతున్నాడని అన్నారు.

నిత్యావసర ధరలు, పెట్రోలు,డీజిల్ ధరలు, బస్ చార్జీలు,కరెంట్,గ్యాస్ ధరలు పెంచి ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

రాష్ట్రమంతా అప్పులే,రోడ్డంతా గుంతలే అని నినదిస్తూ ముందుకు సాగారు.

అలాగే మూడు రాజధానులు వల్ల విశాఖ జిల్లా కు ఉత్తరాంధ్ర కు ఒరిగేదేమీ లేదని,

మూడు రాజధానులు వల్ల కేవలం వైసిపి నేతలకు మాత్రమే లబ్ధి తప్ప మరేమీ ఉండదని అన్నారు.

నిత్యావసర ధరలు తగ్గలన్నా,

అభివృద్ధి కావాలన్నా,

చంద్రబాబు ముఖ్యమంత్రిగా గెలవాలి అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.