నాటుసారా తయారీ,అమ్మకాలు చేపడుతున్న 150 మందికి కౌన్సెలింగ్.
ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా అల్లూరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కొయ్యూరు సీఐ ఆధ్వర్యంలో కొయ్యూరు ఎస్ఐ రాజారావు తమ సిబ్బందితో కలిసి నాటు సారా తయారీ, అమ్మకాలు చేపడుతున్న, అదేవిధంగా పాత సారా కేసుల్లో ఉన్న వారికి, మండలంలో నాటుసారా తయారీ, అమ్మకాలు చేపడుతున్నట్లు అభియోగాలు ఉన్న అందరికీ పోలీస్ స్టేషన్ కి పిలిపించి, కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది.
ఆంద్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆక్ట్ ప్రకారం నేరం, దానికి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధింపబడునని, అదేవిధంగా ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్ చేయించడం జరుగుతుందని, మండలంలో నాటుసారా తయారీ, అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్న 150 మందికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగింది.