Breaking News

వాల్తేర్ డివిజన్,ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ.

0 15

 వాల్తేర్ డివిజన్,ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.


ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శరత్ కుమార్ వాస్తవ ఎంపీ కి పుష్పగుచ్చం,సాలువా అందజేసి స్వాగతం పలికారు.

ఈరోజు విశాఖపట్నం నగరంలో ది గేట్వే హోటల్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ సమావేశంలో పాల్గొని అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు.


పార్వతీపురం బెల్గామ రైల్వే గేటు వద్ద అరకు వ్యాలీ మండలం,సుంకర మెట్ట సెగ్మెంట్,బొండం పంచాయతీ పరిధిలో,బొండాం,రేగా గ్రామాల వద్ద భూగర్భ వంతెన అవసరం నిమిత్తం వంతెనలు నిర్మించాలని కోరారు.


పార్వతీపురం, అరకు రైల్వే స్టేషన్లకు ఆదర్శ స్టేషన్ పథకం ద్వారా సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారుల వద్ద ప్రస్తావించారు.

విశాఖ నుంచి వారణాసి వరకు గతంలో మూడు రోజులకే పరిమితం చేసిన రైలును,మరల పునర్ ప్రారంభించవలసిందిగా కోరారు.

అత్యవసర ప్రయాణ సమయం కోసం ఉన్న ఈక్యు కోటాను,అకారణంగా తగ్గించిన అంశాన్ని లేవనెత్తారు.


విశాఖ నుంచి కోరాఫుట్,కోరాఫుట్ నుంచి విశాఖ నడుపుతున్న ఇంటర్సిటీ రైలు ప్రస్తుతం కేవలం రెండు రోజులకే పరిమితం ఉండగా,ఆ రైలు ప్రతిరోజు తిరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వాల్తేర్ డిఆర్ఎం అనుప్ కుమార్ సత్పతి,లోక్‌సభ ఎంపీలు,రాజ్యసభ ఎంపీలు,రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.