Breaking News

రైతు భరోసా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు:అర్జున్ రెడ్డి.

0 16

 రైతు భరోసా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు:అర్జున్ రెడ్డి. 

ఇందులో పిఎం కిసాన్ నిధి కేంద్ర ప్రభుత్వం నిధులు.

అర్జున్ రెడ్డి 

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం:కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఈ (PM- KISAN) పథకాన్ని నాది అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తుంటే, ఎలా ఉందంటే

ఎవడికో పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకుని తిరిగేలా ఉందని బిజెపి నేత అర్జున్ రెడ్డి ఆరోపించారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 7500 ( రైతు భరోసా) కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6000 ( PM KISAN ) కానీ 13500 రూపాయలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

 ప్రజల డబ్బును వృధా చేస్తూ… సొంత పేపర్ కి యాడ్స్ రూపంలో డబ్బును దోచిపెట్టడం చూస్తుంటే, రాష్ట్రాన్ని దండుపాళ్యం బ్యాచ్ దోచుకున్నట్టుందని ఎద్దేవా చేశారు.

కానీ వైసిపి ప్రభుత్వం మొత్తం మేమే ఇస్తున్నామని చెప్పడం విచిత్రంగా ఉందని,

ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు మంజూరు చేసినా ఫలితం శూన్యమే అని అన్నారు.

సబ్సిడీ విత్తనాలు లేవు, సబ్సిడీ ఎరువులు లేవు, పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదని అపహాస్యం చేశారు.

Leave A Reply

Your email address will not be published.