Breaking News

మావోల కంచుకోట‌లో చింత‌ప‌ల్లి ఏఎస్‌పీ

0 17

 మావోల కంచుకోట‌లో చింత‌ప‌ల్లి ఏఎస్‌పీ ప్రతాప్ శివ కిషోర్.

 రహదారి నిర్మాణానికి చొరవ చూపి,చిన్నారుల‌తో దీపావ‌ళి సంబ‌రాలు చేసుకున్న ఎఎస్‌పీ.


ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టుల‌కు కంచుకోట‌గా ఉన్న గాలికొండ పంచాయ‌తీలో చింత‌ప‌ల్లి ఎఎస్‌పీ కొమ్ము ప్ర‌తాప్ శివ కిశోర్ సోమ‌వారం ప‌ర్య‌టించారు. ద‌శాబ్దాలుగా అప‌రిష్క్రుతంగా ఉన్న ర‌హ‌దారి స‌మ‌స్య ప‌రిష్క‌రించి వారితో దీపావ‌ళి సంబ‌రాల్లో పాల్గొన్నారు. అల్లూరి జిల్లా గూడెం కొత్త‌వీధి మండ‌లం గాలికొండ పంచాయ‌తీ మావోయిస్టుల‌కు అడ్డాగా ఉంది. అయితే గ‌తంలో చింత‌ప‌ల్లి ఎఎస్‌పీ కేపీఎస్ కిశోర్ గ్రామ సంద‌ర్శ‌న‌కు వెళ్లిన‌ప్పుడు త‌మకు ర‌హ‌దారి లేక‌పోవ‌డంతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని, ముఖ్యంగా అనారోగ్య‌ స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్పుడు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని, శ్ర‌మ‌దానంతో ర‌హ‌దారి నిర్మాణం చేద్దామ‌నుకుంటే పెద్ద పెద్ద బండ‌రాళ్లు అడ్డుగా ఉన్నాయ‌ని దీనికి ప‌రిష్కారం చూపాల‌ని కోరారు. గాలికొండ పంచాయ‌తీలో చిల‌క‌గొంది నుంచి పాత్రునిగుంట వ‌ర‌కూ ర‌హ‌దారి లేదు. గ‌తంలో ఈ ర‌హ‌దారి నిర్మాణం కోసం ప‌లు మార్లు టెండ‌ర్లు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ గుత్తేదారులు ముందుకు రాలేదు. దీంతో వారికి ర‌హ‌దారి క‌ల‌గా ఉండిపోయింది. దీనిపై స్సందించిన చింత‌ప‌ల్లి ఎఎస్‌పీ కేపీఎస్ కిశోర్ ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించ‌డానికి న‌డుంబిగించారు. వాస్త‌వానికి ఈ ప్రాంత‌మంతా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతం. అడుగుతీసి అడుగు వేయాలంటే భ‌యం…అయిన‌ప్ప‌టికీ ఎఎస్‌పీ వ్య‌క్తిగ‌త అంగ‌ర‌క్ష‌కుల‌తో పెద్ద బూసికొండ గ్రామాన్ని సోమ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. గ్రామ‌స్థుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. మీరు చేయి చేయి క‌లిపితే మేము స‌హ‌క‌రిస్తామ‌న్నారు. దీనికి గ్రామ‌స్థులంతా సై అన్నారు. చింత‌ప‌ల్లి నుండి తీసుకువచ్చిన జెసిబి తో పెద్ద బండరాలను తొలగించి రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ దీపావళికి మీ గ్రామంలో ఉన్న రహదారి కష్టాలు తొలగిపోయి పోలీస్ శాఖ నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని చింతపల్లి ఏ ఎస్ పి ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జి కే వీది సీఐ అశోక్ కుమార్, గాలికొండ సర్పంచ్ బుజ్జిబాబు, ఎంపీటీసీ బుజ్జిబాబు గ్రామస్తులు,పిల్లలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.