Breaking News

ఈనెల 28 న పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.

0 16
స్వామి నాయుడు (సిఐ)

 ఈనెల 28న కొయ్యూరులో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కొయ్యూరు సీఐ స్వామి నాయుడు తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా కొయ్యూరు పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మనం చేసే రక్తదానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని  అవకాశం ఉన్న వారంతా రక్తదానం చేయాలని సిఐ పిలుపునిచ్చారు. రక్తదానం చేయటం పట్ల ఉన్న అపోహలను విడనాడి ప్రతి ఒక్కరు రక్తదాన శిబిరంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐ స్వామి నాయుడు కోరారు.

Leave A Reply

Your email address will not be published.