Breaking News

కొయ్యూరు: క్రీడా పోటీలకు 120 మంది విద్యార్థులు ఎంపిక.

0 18

 క్రీడా పోటీలకు 120 మంది విద్యార్థులు ఎంపిక:


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు:   

 ఈ నెల 7,8 తేదీల్లో జిల్లా కేంద్రం పాడేరు లో నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల,జోనల్,జిల్లా స్థాయి క్రీడాపోటిల్లో ఆటలాడేందుకు కొయ్యూరు మండలం నుంచి అన్ని పాఠశాలల నుండి 120 మంది బాలురు,బాలికలను ఎంపిక చేసినట్లు మండల అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి క్రాంతికుమార్ తెలిపారు.


స్థానిక సిఎహెచ్ స్కూల్ వద్ద మంగళవారం ప్రధానోపాధ్యాయులు శ్యామ్ సుందర్,బి.వి మూర్తి,సీహెచ్ గోపాల్ తదితరులు ఇక్కడ క్రీడాల్లో పాల్గొనే విద్యార్థులను ఎంపిక కార్యక్రమం ప్రారంభం చేశారు. మండల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ,ఏపిఆర్, ఆశ్రమ,జిల్లాపరిషత్ తదితర పాఠశాలల నుండి హాజరైన వారిలో 120 మందిని బాలురు,బాలికలను ఎంపిక చేసినట్టు ఏటీడబ్ల్యూ క్రాంతికుమార్,పీడి అంబటి నూకరాజు తెలిపారు.

మండలం నుండి ఎంపికైన వారు తొలుతగా మండల స్థాయిలో ఆడి అక్కడ గెలిచిన విద్యార్థులు జోనల్ స్థాయిలో ఆడనున్నట్టు తెలిపారు. ఆ జోనల్ స్థాయి లో గెలిపొందిన విద్యార్థులు స్కూల్ గేమ్ ఫెడరేషన్ లో జిల్లా స్థాయి పోటిల్లో పాల్గొననున్నట్టు తెలిపారు. ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటిల్లో అండర్ 14,17 తో పాటు,200,400,600,800 మీటర్లు రన్నింగ్,అథ్లెటిక్స్,జావిలిన్ త్రో,డిస్కకిక్,తదితర ఆరు ఆటల్లో పోటీలకు వీరిని ఎంపిక చేసినట్టు తెలిపారు.

వీరికి వార్డెన్ మోహన్ తదితరులు తగిన సహాయ సహకారాలు అందించినట్టు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.