Breaking News

ప్రధాని నరేంద్ర మోదీ కి వీడ్కోలు పలికిన బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు.

0 17

 ప్రధాని నరేంద్ర మోదీ కి వీడ్కోలు పలికిన బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు.


 విశాఖపట్నంలో పర్యటన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ కి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ని కలుసుకోవడం నా జీవిత ధన్యమని, ప్రపంచ అధినేతలలో అత్యంత ప్రభావితం కలిగిన నేతను స్వయంగా చూడడం తన అదృష్టమని ఆయన అన్నారు.బీజేపీ దేశంలో అన్ని వర్గాలకు చేరువ అవుతుందని, గిరిజన ప్రాంతాల్లో బీజేపీ కి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ఆదరణ లభిస్తోంది అని, మోడీ విశాఖపట్నం పర్యటన ద్వారా ఆంద్రప్రదేశ్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని,రాబోయే రోజుల్లో బీజేపీ కి మంచి ఫలితాలు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.