Breaking News

అంతాడ సచివాలయం పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం.

0 16

 గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం జగనన్నతోనే సాధ్యం..పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.


అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం:

ముందుగా బంగారంపేట లో నూతన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు.

అనంతరం అంతాడ గ్రామ సచివాలయ పరిధిలో కొత్తపల్లి,తాటిమానుపాలెం గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.

మరల అంతాడ చేరుకొని అంతాడలో నూతన సచివాలయ భవనం, రైతు


భరోసా కేంద్రం భవనమును ఆమె ప్రారంభించారు.

ప్రారంభం అనంతరం అంతాడ, మునసల,దోమలగొంది,రాతిమామిడి గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.


 మొత్తం 336 గ‌డ‌ప‌లకు ఎమ్మెల్యే భాగ్య‌ల‌క్ష్మి వెళ్లి అక్క‌డి వారితో మాట్లాడారు. ఇంటింటికీ వెళుతూ ప్ర‌భుత్వం ఈ మూడేళ్ల‌లో అందించిన సంక్షేమ ప‌థ‌కాల గురించి వివ‌రించారు. ప్ర‌తి ఇంట్లో ఏయే ప‌థ‌కాల‌ ద్వారా ల‌బ్ధిపొందార‌న్న విష‌యాల‌ను తెలుసుకున్నారు.


ఎవ‌రైనా అర్హత ఉండీ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు పొంద‌ని వారికి అవ‌గాహ‌న క‌ల్పించారు. గ‌డ‌ప గ‌డ‌ప‌లోనూ శాస‌న స‌భ్యులు కొట్టగుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి కి అపూర్వ స్పంద‌న ల‌భించింది. ప్ర‌భుత్వం అందించిన ప‌థ‌కాల‌ను వివ‌రించ‌డ‌మే కాకుండా త‌మ స‌మ‌స్య‌ల‌ను వినేందుకు ఎమ్మెల్యే తమ ఇంటి వ‌ద్ద‌కే రావ‌డంపై ప్రజలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను శాస‌న ఎమ్మెల్యే కి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కొట్ట‌గుళ్ళి భాగ్య‌ల‌క్ష్మి మాట్లాడుతూ.. గిరిజ‌నులంటే  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి ఎన‌లేని అభిమానం ఉంది అని, ఆదివాసీయులు ఉండే ప్రాంతానికి ప్ర‌త్యేకంగా అల్లూరి సీతారామ‌రాజు పేరిట జిల్లాను పెట్టార‌ని, ఇది స్వాతంత్య్ర భార‌త చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ చేయ‌లేని ప‌నిగా ఆమె అభివ‌ర్ణించారు.

భ‌విష్య‌త్‌లో గిరిజ‌నుల మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సాధించిన‌ట్టుగా పేర్కొన్నారు. అల్లూరి జిల్లాలో ప్ర‌తి మారుమూల ప‌ల్లెకు వెళ్లాల‌నే ర‌హ‌దారి ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు ఎమ్మెల్యే తెలిపారు.

దీని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక ర‌చించింద‌ని 2024లోనూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నే ముఖ్య‌మంత్రిగా మ‌న‌మంతా ఓట్లేసి గెలిపిస్తే గిరిజ‌న ప్రాంతంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అవ‌కాశం ఉంటుంద‌ని ఆమె తెలిపారు.

 ఈ కార్య‌క్ర‌మంలో ఎంపిపి బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, స్తానిక సర్పంచులు సుర్ల చందర్రావు, కురుజు పెంటమ్మ,వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ,అంబటి నూకాలమ్మ,కొయ్యూరు మండలం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,మండల మహిళా అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ,పీఎసీఎస్ చైర్మన్ అప్పన గజ్జయ్యదొర, బి.సి.కార్పొరేషన్ డైరెక్టర్ గాడి నాగమణి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రేగటి ముడిలినాయుడు,వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు,ఎంపీటీసీలు బిడిజాన అప్పారావు,మల్లీశ్వరి, మండల నాయకులు గాడి అచ్చిరాజు,బండి సుధాకర్,పొట్టిక పోతురాజు,కాళ్ళ వనుం బాబు,ధోని బాబ్జీ, ఉల్లి సూరిబాబు,పాటి శేఖర్,రీమల గంగాధర్, సావిత్రి,వార్డు స‌భ్యులు, మండ‌ల స్థాయి అధికారులు పంచాయితీ రాజ్ డి. ఇ. నరేన్ కుమార్,ఎంపిడిఓ మేరీ రోజీ, ఏ. ఇ. సి. హెచ్. రామకృష్ణ, ఎం. ఇ. ఓ బొడం నాయుడు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది,ఐసీడీఎస్ సిబ్బంది, స‌చివాల‌య సిబ్బంది, అధిక సంఖ్య‌లో మ‌హిళ‌లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.