Breaking News

కేంద్ర కాఫీ బోర్డ్ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ

0 15

 కేంద్ర కాఫీ బోర్డ్ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

ఈరోజు కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరులో జరిగిన మొట్టమొదటి కేంద్ర కాఫీ బోర్డ్ సమావేశంలో అరకు ఎంపీ&కేంద్ర కాఫీ బోర్డ్ సభ్యురాలు  మాధవి సహచర బోర్డు సభ్యులతో కలిసి పాల్గొనడం జరిగింది.


తొలుత డాక్టర్ కే.జీ జగదీష్ (ఐఏఎస్) కేంద్ర కాఫీ బోర్డ్, సిఈఓ&సెక్రటరీ,అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ని పుష్పగుచ్చం అందజేసి సమావేశానికి స్వాగతం పలికారు.


ఈ సందర్భంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పలు అంశాలను బోర్డు దృష్టికి ప్రస్తవించడం జరిగింది.

అరకు,పాడేరు ప్రాంతంలో కాఫీ పండించే రైతులకు కాఫీ బోర్డ్ ద్వారా ఉత్తమ సేవలను అందించేలా,కాఫీ రైతులకు బోర్డు ద్వారా ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.


కాఫీ పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు చేపట్టి,మన్యం కాఫీ పంటకు మంచి మార్కెటింగ్ సౌకర్యాలు కాఫీ బోర్డు ద్వారా కల్పించాలని తెలిపి,గ్రామాలలో,సంతల్లో రైతులు దళారులను ఆశ్రయించి,కాఫీ పంటకు సరైన మార్కెట్ ధర తెలియక,సాగు దారులు మోసపోతున్నారని,దళారుల నుండి విముక్తి కలిగించేలా బోర్డు నుండి చర్యలు,త్వరితగతిన చేపట్టాలని పేర్కొన్నారు.

కాఫీ బోర్డు సబ్సిడీ పథకాల ద్వారా కాఫీ రైతులకు కంపోస్ట్ కిట్లను అందించడం ద్వారా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచించి, పెంపకందారులను అభివృద్ధి చేయడం మరియు ప్రోత్సహించడం అలాగే ప్రవేట్ వ్యవస్థాపకులను చేపట్టాలని కోరారు.

అరకు వ్యాలీ కాఫీ ఇతర మండలాలకు ప్రత్యేక ట్యాగ్ లైన్ తో ప్రారంభించేలా ప్రోత్సహించాలని తెలిపారు.

కాఫీ రైతులకు మోనో షెడ్ వంటి వాటిని నివారించేందుకు మిశ్రమ నీడ చెట్ల సిల్వర్ ఓక్ మొక్కలను అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

రైతులకు తెల్లకాండం తొలుచు పురుగు నిర్వహణపై,కాఫీ బోర్డు ద్వారా శిక్షణ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర కాఫీ బోర్డ్ సభ్యులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.