అడవి బిడ్డలకు అన్నదానం అనే వినూత్న కార్యక్రమం మొదలు పెట్టిన
దుమంతి.సత్యనారాయణ.
అల్లూరి జిల్లా,కొయ్యురు మండలంలో తహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దుమంతి సత్యనారాయణ శనివారం బూదరాళ్ల గ్రామపంచాయతీ పరిధిలోగల దూరపాలెం గ్రామంలో అడవి బిడ్డలకు అన్నదానం అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇప్పటినుండి ప్రతీ నెలలో 2 లేక 3 నిరుపేద గిరిజన గ్రామాలలో
ఈకార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈకార్యక్రమంలో అన్నదానం ప్రాముఖ్యతతో పాటు విధ్యా ధానం
యొక్క విలువలను కూడా వివరించడం జరుగుతుందని అన్నారు.
ఈకార్యక్రమం అంబేద్కర్ సూచించిన Pay back to the Society కి ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు
మొట్టడం.చిన్ని,సడ్డా.వెంకటేశ్వర్లు, దుమంతి.భరత్,కిరణ్,నరేష్,సాతా.పండు మొదలగు వారు పాల్గొన్నారు.