Breaking News

చెరువు పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.

0 18

 చెరువు పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.

 22 లక్షల రూపాయలతో అమృత్ సరోవర్, ఉపాధి హామీ నిధులతో చెరువు పూడికతీత.


అల్లూరి సీతారామరాజు జిల్లా,

జీకే వీధి మండలం, పెదవలస లో చెరువు పూడికతీత పనులను పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మంగళవారం ప్రారంభించారు. రూ. 22 లక్షల అమృత్ సరోవర్, జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో ఈ చెరువు పూడికతీత పనులను చేపట్టనున్నారు.


శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాతకు మేలు జరగాలన్నది ప్రభుత్వం ఆలోచనని, అందరికీ అన్నం పెట్టే రైతన్న ముఖాల్లో చిరునవ్వును చూడాలన్నదే నాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి గాని, నేటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గాని ఆలోచనచేస్తున్నారని ఆమె తెలిపారు. అన్నదాతల కోసం కేవలం వైయస్సార్ కుటుంబం మాత్రమే ఆలోచన చేసిందని గతంలో గాని, భవిష్యత్తులో గాని మరెవరు ఇటువంటివి రైతులకు మేలు జరిగే ఆలోచన చేయలేరని ఆమె తెలిపారు. రైతులకు పంటలు వేసే సమయంలో అప్పుల కోసం ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే పంట పెట్టుబడిగా ఏటా రూ.13500 వైయస్సార్ రైతు భరోసా కింద అందజేయడం సంతోషదాయకమని ఆమె తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అన్నదాతల పక్షాన నిలుస్తుందని, తమది ప్రజా అన్నదాతల ప్రభుత్వమని భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమారి, వైస్ ఎంపీపీలు ఆనంద్,దేవుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్, స్థానిక సర్పంచ్ పాంగి కృష్ణారావు, లక్కవరపుపేట సర్పంచ్ వీరేంద్ర ప్రసాద్,రెంటాడ సర్పంచ్ బొబ్బిలి లక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిరి ప్రసాద్, రామారావు, కంచిపాటి శ్రీరాములు, పిఎసిఎస్ చైర్మన్ ప్రసాద్, అంజి, చింతపల్లి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.