Breaking News

స్పూర్తి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి:మంప ఎస్ఐ లోకేష్ కుమార్.

0 19

 

స్పూర్తి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి:మంప ఎస్ఐ లోకేష్ కుమార్.

పోలీస్ శాఖ అలాగే ఐటిడిఏ ల సమన్వయంతో నిర్వహిస్తున్న స్ఫూర్తి కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంప ఎస్ఐ లోకేష్ కుమార్ అన్నారు.

అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం, 

బూదరాళ్ళ పంచాయతీ లోని గరిమండ గ్రామంలో వారపు సంతలో గరిమండ ,అన్నవరం ,గొర్లెమెట్ట, కన్నవరం ఇతర చుట్టుపక్కల గ్రామస్తులతో, గిరిజన యువతతో ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ నోటిఫికేషన్ కు చివరి తేదీ ఈ నెల 30వ తారీకు కావున 10వ తరగతి పాస్ అయ్యి ఉన్న విద్యార్థులు, వయసు 18 నుంచి 28 సంవత్సరాలు (SC&ST) లకు ఎత్తు పురుషులు 162.5 cm, స్త్రీలు 150 cm ఉన్న విద్యార్థులందరూ దీనికి అర్హులు అని, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు పోలీస్ స్టేషన్ కు వచ్చి అప్లై చేసుకోవాలని మంప ఎస్ఐ లోకేష్ కుమార్ తెలిపారు. ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ ఎగ్జామ్ కు అప్లై చేసుకున్న వారికి స్ఫూర్తి కార్యక్రమం ద్వారా పోలీస్ అలాగే ఐటీడీఏ వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, వసతి, భోజన సౌకర్యాలు కల్పించబడతాయిని, గిరిజన యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.