Breaking News

ఈరోజు కొయ్యూరు లో మూడు జిల్లాల కుస్తీ పోటీ క్రీడాకారుల ఎంపిక.

0 37

 ఈరోజు కొయ్యూరు లో మూడు జిల్లాల కుస్తీ పోటీ క్రీడాకారుల ఎంపిక. 

– ఫిజికల్ డైరెక్టర్ నూకరాజు


అల్లూరి జిల్లా, కొయ్యూరు లో ఈరోజు విశాఖ,అనకాపల్లి,అల్లూరి (ఉమ్మడి జిల్లా) జిల్లా కు చెందిన కుస్తీ (రెజిలింగ్ )పోటీలకు పాల్గొనే క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్టు కోచ్ కొయ్యూరు పి డి అంబటి నూకరాజు తెలిపారు. పాడేరు జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కొండలరావు,కొయ్యూరు ఏటీడబ్ల్యూఓ క్రాంతి కుమార్, హెచ్ ఎం బివిఎస్ మూర్తి ఆధ్వర్యంలో స్థానిక బాయ్స్-1 పాఠశాల వద్ద ఈ కుస్తీ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్టు కోచ్ నూకరాజు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో భాగంగా ఈ కుస్తీ పోటీలకు ఇక్కడ ఎంపికకు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.ఈ ఎంపికలో సెలెక్ట్ అయిన వారు మండల,జిల్లా స్థాయి పోటిలకు వెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ఈ కుస్తీ పోటీలకు ఎంపిక ప్రక్రియ కొయ్యూరు లో ఏర్పాటు చేయడం జరిగిందని పిడి నూకరాజు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.