Breaking News

అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.

0 25

 అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్.


గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం మేరకు కొయ్యూరు సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు ఎస్ఐ రాజారావు తమ సిబ్బందితో కలిసి అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం లోని కాకరపాడు గ్రామ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా కృష్ణాదేవి పేట మార్గం నుండి కాకరపాడు మీదుగా ఏలేశ్వరం వైపు వెళుతున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు వారిని చూసి వారు ప్రయాణిస్తున్న స్కూటీని వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసు వారు వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా 10 కేజీల గంజాయి ఉందని ఎస్ఐ రాజారావు తెలిపారు. వారి వద్ద నుండి 10 కేజీల గంజాయితో పాటు ఒక ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలానికి చెందిన నక్కా శ్రీను, మరొకరు మహారాష్ట్ర రాష్ట్రం, ముంబై కి చెందిన జోకిమ్ డిసౌజ అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.