74వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో కామన్ పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ నిర్మాణం-ప్రజాస్వామ్య వ్యవస్థ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తో కలిసి పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి కాకాణి… భారతదేశానికి అత్యున్నత రాజ్యాంగాన్ని అందించారని కొనియాడిన మంత్రి.
బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపు…
అందుకనుగుణంగా కామన్ పీపుల్స్ ఫౌండేషన్ ఓ పుస్తకాన్ని తయారు చేయాలని సూచన.
కార్యక్రమంలో పాల్గొన్న విక్రమ సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుందరవల్లి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్, కామన్ పీపుల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు వీరతాటి దేవదాస్, చిట్టేటి మాలాద్రి తదితరులు పాల్గొన్నారు.