Breaking News

ఘనంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం.

0 21

 ఘనంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం.


ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా ప్రముఖ్ ఎం.ఎం.ఎల్. పాత్రుడు, ఎస్సి. ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక జిల్లా అధ్యక్షులు పాంగి సోములు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ ముసాయిదా కమిటీ సంకలనం చేసిన భారత రాజ్యాంగ ముసాయిదాని 73 సంవత్సరాల క్రితం ఇదే రోజున రాజ్యాంగ పరిషత్తు ఆమోదించిందని,రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వ్యాప్తి చేయడానికి అంబేద్కర్ ఆలోచనలను అందరికి తెలియజేయడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యొక్క 125వ జయంతి సందర్బంగా 2015 లో భారత ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు.


నిత్యం దేశం కోసం అంబేద్కర్ చేసిన ఆలోచనకి ప్రతి రూపం నేటి మన భారత రాజ్యాంగం అన్నారు. ప్రతి ఒక్కరు అంబేద్కర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ పాంగి రామయ్య, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గెమ్మెలి కళ్యాణ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అల్లంగి మహేష్ బాబు,ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు మినుముల గోపాల పాత్రుడు, లకే భాస్కర్, పూజారి ఉపేంద్ర, కిల్లో మోహన్, సీసా సత్తిబాబు, మల్లేష్, బాబ్జి,మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.